మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

ఘ‌ట‌న‌ స్థలాన్ని పరిశీలించిన పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
Kerala plane crash Aviation Minister announces Rs 10 lakh

కోలికోడ్‌: కేరళలోని కోలికోడ్‌ విమాన ప్రమాద స్థలాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి పరిశీలించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ‌స‌భ్యుల‌కు తాత్కాలికంగా ప‌ది ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు ఆయన తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌వారికి రెండు ల‌క్ష‌లు, స్వ‌ల్ప గాయాలైన వారికి 50 వేల‌ను అత్య‌వ‌స‌రంగా ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. విమాన శిథిలాలను కేంద్ర మంత్రి హ‌రిదీప్ ప‌రిశీలించారు. ప్ర‌మాద సైట్‌కు వెళ్లిన ఆయ‌న అధికారుల‌తో ఆ ప్రాంతాన్ని త‌నిఖీ చేశారు. ప‌దేళ్ల క్రితం మంగ‌ళూరులో జరిగిన విమాన ఘ‌ట‌న త‌ర‌హాలో ఈ ప్ర‌మాదం జ‌రిగినా.. ఇక్క‌డ ప్రాణ‌న‌ష్టం ఎక్కువ‌గా జ‌ర‌గ‌లేద‌న్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/