పేలిన గ్యాస్‌ సిలిండర్‌… పదిమంది మృతి

శిథిలాల కింద మరికొందరు

Cylinder-Blast
Cylinder-Blast

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని మొహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఏకంగా పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలడంతో రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ కారణంగానే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/