హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్‌ రైళ్ల తాత్కాలిక రద్దు

MMTS train
MMTS train

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటిఎస్‌ రైళ్లను హైదరాబాద్‌లో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నేడు కూడా అదేవిధంగా నాంపల్లి-ఫలక్‌నూమా, నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్‌-ఫలక్‌నూమా, జనగామ-ఫలక్‌నూమా రూట్లలో సర్వీసులను రద్దు చేశారు. నిన్న 19 రైళ్లను పూర్తిగా, మరో 24 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. కాగా నేడు మరో 24 సర్వీసులను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంది. నిర్వహణాపరమైన కారణాలతోనే రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాగా ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగులు, కాలేజిలకు వెళ్లవలసిన విద్యార్థులు ఎంఎంటిఎస్‌లు రాకపోవడంతో మెట్రో స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. వీళ్ల తాకిడి నగరంలోని మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/