ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబూమోహన్‌

BabuMohan
BabuMohan

బెంగాళూరు: సినీ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ చించోళి ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బిజెపి అభ్యర్థికి మద్దతుగా బుధవారం పాల్గొన్నారు. చించోళిలో పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప కొంత సమయం ప్రచారం చేసిన అనంతరం తెలంగాణలోని తాండూరు గ్రామానికి వెళ్లారు. తెలంగాణకు చెందిన ప్రజలు చించోళి, కలబురగి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో వలస వచ్చి ఉండడంతో వారిని ఆకట్టుకునేందుకు బాబూమోహన్‌ ప్రచార సభలో పాల్గొన్నారు. చించోళికి చెందిన 3వేల మంది ఓటర్లు అక్కడ ఉపాధి నిమిత్తం అక్కడ ఉన్న సందర్భంగా పార్టీ అభ్యర్థి ఉమేశ్‌ జాదవ్‌, నాయకులు అరవింద లింబావళి తదితరులు తాండూరు వెళ్లారని పార్టీ నాయకులు తెలిపారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/