ఘనంగా సినీ నటి అర్చన నిశ్చితార్థం


ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో నిశ్చితార్థం

actress Archana-Jagdish
actress Archana-Jagdish

హైదరాబాద్‌: ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ జగదీశ్‌తో టాలీవుడ్ నటి అర్చన (వేద) నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన నిశ్చితార్థ కార్యక్రమానికి నటులు నవదీప్, శివబాలాజీ, సుమంత్, నటి మధుమిత తదితరులతోపాటు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అర్చనజగదీశ్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత నెలలోనే ప్రియుడు జగదీశ్‌తో కలిసి దిగిన ఫొటోను అర్చన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. త్వరలోనే శుభవార్త వింటారని పేర్కొంది. 2004లో ఖనేనుగ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అర్చన తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్‌ వన్‌లో పోటీపడింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/