కాంగ్రెస్‌ కన్నా ఎంఐఎంకే ఎక్కువ ఎమ్మెల్యేలు

Asaduddin Owaisi
Asaduddin Owaisi

హైదరాబాద్‌: తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కలవనున్నట్లు ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు. ఎంఐఎంకు ప్రతిపక్షహోదా కోరడం కోసం స్పీకర్‌ను కలుస్తాం. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం అవతరించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కన్నా ఎంఐఎంకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఇదే విషయాన్ని సభాపతిని కలసి వివరించి సభలో ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందిగా విన్నవిస్తామన్నారు. స్పీకర్‌ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు ఓవైసీ తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/