17న నెక్లెస్‌రోడ్‌లో వి ఆర్‌ వన్‌ రన్‌

shikha goel, crime cp
shikha goel, crime cp


హైదరాబాద్‌: నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో ఈ నెల 17న షీ టీమ్‌ ఆధ్వర్యంలో పరుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. we are one (మనమంతా ఒక్కటే) పేరుతో 10కె, 5కె, 2కె పరుగు నిర్వహిస్తున్నట్లు క్రైమ్‌ అదనపు సిపి శిఖా గోయల్‌ తెలిపారు. పరుగులో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 5 వేల మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. పరుగు దృష్ట్యా ఆదివారం పీపుల్స్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పరుగు కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్‌ ప్రారంభిస్తారని..పరుగులో డిజిపి, సినీ ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు.