నేడు నగరానికి రానున్న ఉపరాష్ట్రపతి ..ట్రాఫిక్‌ ఆంక్షలు

vice president Venkaiah Naidu
vice president Venkaiah Naidu

హైదరాబాద్‌: ఈరోజు హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయాని ట్రాఫిక్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొనిన అక్కడి నుండి అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌లో ఓ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నట్లు అనిల్‌కుమార్‌ తెలపారు. 11 గంటలకు బేగంపేట, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుల మీదుగా ఆయన ఇంటికి చేరుకుంటారు. ఆయా సమయాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/