ఫోన్లు, టివిల లోకం నుంచి బయటపడాలి

venkaiah naidu, vice president
venkaiah naidu, vice president


హైదరాబాద్‌: ఫోన్లు, టివిలకు దూరంగా ఉండాలని, అవే లోకంగా భావించే సంస్కృతికి స్వస్తి చెప్పాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. శారీరక శ్రమ మన జీవన శైలికి అత్యంత అవసరమని సూచించారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌-కేర్‌హహాస్పిటల్స్‌ సంయుక్తంగా శనివారం శంషాబాద్‌ పరిధి ముచ్చింతల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ..ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్సాహాన్నిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వైడ్య సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు.

తాజా సినిమా వీడియాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos