కెసిఆర్‌ రాజ్యాంగ విరుద్దంగా పాలన చేసున్నారు

Uttam Kumar
Uttam Kumar

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ చీఫ్‌, ఎంపి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సిఎం కెసిఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఉన్నతస్థాయి రాజ్యాంగ పదవులను ఆక్రమించిన వ్యక్తులు కెసిఆర్‌ పాలనలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. వరస చూస్తుంటే గౌరవనీయ స్పీకర్ వ్యవహార శైలిపైనా అనుమానాలు కలుగుతున్నాయని, విపక్షాల వాదనలను ఉద్దేశపూర్వకంగా కొన్నివారాల పాటు పట్టించుకోకుండా పక్షపాత ధోరణితో వ్యవహరించినట్టు అర్థమవుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సిఎం కెసిఆర్‌ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/