లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సత్తా చాటబోతుంది!

Jagadish Reddy
Jagadish Reddy

సూర్యాపేట: 2014లో మోడిని ప్రజలు నమ్మారు.. కానీ ఇప్పుడు నమ్మడం లేదని విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి స్పష్టం చేశారు. రేపు నల్లగొండలో జరిగే సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.ఏప్రిల్ 11న జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటబోతుందని ఆయన స్పష్టం చేశారు. వందేళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణను సాధించిన సిఎం కెసిఆర్‌ దేశం ఆకర్షించే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారని తెలిపారు. నేడు దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ 16 స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో గెలవబోతుందన్నారు. ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు మంత్రి జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రేపు జరగబోయే నల్లగొండ పార్లమెంటరీ స్థాయి సన్నాహక సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/