నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు

టిఆర్‌ఎస్‌ కు నేను కూడా ఓనర్ నే

naini-narshimha-reddy
naini-narshimha-reddy

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ నేత,మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. . అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే… ముఠా గోపాల్ ను గెలిపించుకునిరా… తనను మంత్రిని చేస్తానని సిఎం కెసిఆర్‌ మాట ఇచ్చారని… ఇప్పుడు ఆ మాట తప్పారని మండిపడ్డారు. హోంమంత్రిగా పని చేసిన తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి తాను కూడా ఓనర్ నే నని వ్యాఖ్యానించారు. పార్టీలోకి కిరాయికి వచ్చిన వారు ఎప్పుడు దిగిపోతారో తెలియదని అంటూ నాయినీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/