ఉపరితల ఆవర్తనంతో నేడు జల్లులు

rain
rain

హైదరాబాద్‌: రాయలసీమ నుంచి కోమోరిన్‌ ప్రాంతం వరకు ఇంటీరియర్‌ తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ధ్రోణి కొనసాగుతున్నది. ఛత్తీస్‌ఘడ్‌ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దీని ప్రభావంగా రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశముందన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/