శ్రీవారిని దర్శించుకున్నస్పీకర్ పోచారం

Pocharam-srinivas-reddy
Pocharam-srinivas-reddy


తిరుమల: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ శ్రీవెంకటేశ్వరస్వామి వారిన ఈరోజు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ సారి ప్రభుత్వం చేపట్టిన సంధర్బంగా స్వామి వారికి మ్రొక్కులు చెల్లించుకొవడానికి తిరుమల వచ్చినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆదేవదేవున్ని కోరుకున్నట్లు పోచారం పేర్కోన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/