నేటి నుంచి 14 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

TS INTER BOARD
TS INTER BOARD


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయినవి. ఈ పరీక్షలు ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, పరీక్ష ప్రారంభం ఐన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తేఉండదని ఇదివరకే ప్రకటించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/