సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్‌

telangana high court
telangana high court


హైదరాబాద్‌: సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టులో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి వేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని అనుకున్నపుడు, 2016లో హైకోర్టులో జీవన్‌రెడ్డి పిల్‌ దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం సచివాలయం కూల్చివేయడం సమంజసం కాదని, సచివాలయ భవనాన్ని కూల్చబోమని సర్కారు తరఫున అప్పటి అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఏజి వాంగ్మూలాన్ని గతంలో హైకోర్టు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాట మార్చిందని, సచివాలయం భవనాలను కూల్చివేతకు రంగం సిద్ధమైందని తాజాగా సోమవారం జీవన్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిల్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/