తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Telangana
Telangana

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. వేడుకలకు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. నేతలు ఒకరినొకరు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.