బిజెపి గూటికి చేరునున్న విజయశాంతి?

  • పార్టీ అగ్ర నాయకత్వం కనుసన్నల్లో సంప్రదింపులు
Vijayashanti
Vijayashanti

హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బిజెపి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బిజెపి గూటికి చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాదు వరకు పార్టీని బలోపేతం చేయాలంటూ రాష్ట్ర పార్టీ నేతలకు ఇప్పటికే ఆయన స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ క్రమంలో, తాజాగా కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారనేదే ఆ వార్త. ఆమెతో పాటు ఒక మాజీ ఉపముఖ్యమంత్రి, పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పలువురితో పార్టీ నాయకత్వం చర్చలు జరిపిందని… సంప్రదింపుల వ్యవహారం మొత్తం బిజెపి జాతీయ నాయకత్వం కనుసన్నల్లోనే జరుగుతోందని సమాచారం.

ఈ సందర్భంగా ఓ బిజెపి అగ్రనేత మాట్లాడుతూ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలకు చెందిన ముగ్గురు మాజీ ఎంపీలు, ఒక మాజీ డిప్యూటీ సీఎం, 8 మంది మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/