టిఆర్‌ఎస్‌లోకి సుధీర్‌రెడ్డి!

sudheerreddy
sudheerreddy

టిఆర్‌ఎస్‌లో చేరిన ఏడో కాంగ్రెస్‌ సభ్యుడు
రెండు, మూడు రోజుల్లో మరో ముగ్గురు

 హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిందే 10 సీట్లు ఐతే ఆ పదిమంది కూడా టిఆర్‌ఎస్‌లోకి ఒక్కక్కరుగా వలస బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం కేటిఆర్‌ ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. తన నియోజకవర్గం ఎల్బినగర్‌ అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానని సుధీర్‌రెడ్డి వెల్లడించారని తెలిసింది. కేసిఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అన్నారు. సుధీర్‌రెడ్డి నిర్ణయాన్ని కేటిఆర్‌ స్వాగతించారు. రెండు ,మూడు రోజుల్లో సియం కేసిఆర్‌తో సుధీర్‌రెడ్డి భేటి కావాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వీరు పలు అంశాలపై చర్చించారు.

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/