తీగెల కృష్ణారెడ్డితో సబితా ఇంద్రారెడ్డి సమావేశం

sabitha indra reddy
sabitha indra reddy

హైదరాబాద్‌: ఎమ్మెల్యె సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్‌ రెడ్డి ఈరోజు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యె తీగెల కృష్ణారెడ్డితో సమావేశం అయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌ తిరుమల హిల్స్‌లోగల తీగెల నివాసానికి సబితా, కార్తిక్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ వెళ్లారు. ఈసందర్భంగా వారి మధ్య ఆయా విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే గత డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నుంచి తీగెల, కాంగ్రెస్ నుంచి సబితా పోటీలో ఉన్నారు. అయితే… చివరకు విజయం సబితనే గెలిచారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/