రైతుబందు నిధులు విడుదల

rythu bandhu
rythu bandhu

హైదరాబాద్‌: తెలంగాణలో రైతుబందు పథకానికి రూ. 6900కోట్ల నిధులు విడుదల చేస్తూ వ్యవసాయశాఖ ముఖ కార్యదర్శి సీ పార్థసారథీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఏడాది నుంచి ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుబంధు పథకం అమలుకానుంది. ఖరీఫ్, రబీ పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నారు.
తెలంగాణ సిఎం కెసిఆర్‌ గతేడాది సీజన్‌కు ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా, ఈ వానకాలం నుంచి దానిని రూ.5 వేలకు పెంచుతామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీఇచ్చారు. అందుకోసం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ఇప్పటికే రూ.12 వేల కోట్లు కేటాయించారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ఈ వానకాలం నుంచి పెంచిన సొమ్మును ప్రతి రైతుకు అందజేస్తారు. ఆర్బీఐకి చెందిన ఈకుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టా భూమి ప్రకారం పెట్టుబడి సాయం జమచేస్తామని పార్థసారథి తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/