రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

road accident
road accident


వరంగల్‌: వరంగల్‌ రూరల్‌ జిల్లా కొమ్మాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ద్విచక్రవాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/