టీ-కాంగ్రెస్‌ కు మద్దతు ఇవ్యాలని రేవంత్‌ రెడ్డి కోరారు : చాడ

హైదరాబాద్‌ : చాడ వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ,లోక్ సభ ఎన్నికల్లో టీకాంగ్రెస్ కు తమ పార్టీ మద్దతు విషయమై రెండ్రోజుల్లో ప్రకటిస్తామని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐను టీకాంగ్రెస్ కోరిందిటీకాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి తనను కోరారని చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు భ్రష్టుపట్టాయని, కేసీఆర్ సీఎం అయ్యాక రాజకీయ విలువలకు పాతరేశారని, దళిత, మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

https://www.vaartha.com/telengana/
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: