పోలీసుల ఎదుట విచారణకు హాజరైన రవిప్రకాశ్‌

ravi prakash
ravi prakash, TV9 ceo

హైదరాబాద్‌: టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌ ఎట్టకేలకు సైబరాబాద్‌ సిసిఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ అలంద మీడియా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. 41ఏ సిఆర్సీసి కింద విచరణకు హాజరుకావాలని ఇది వరకే ఆయనకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీ చేసినా హాజరుకాలేదు. ముందస్తు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా హైకోర్టు, సుప్రీంకోర్టులో రవిప్రకాశ్‌ అప్పీలు చేసుకున్నా లాభం లేకుండా పోయింది. రవిప్రకాశ్‌ విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అలాగే విచారణకు వచ్చిన వెంటనే అరెస్టు చేయకూడదని, ఒక వేళ అరెస్టు చేయాలనుకుంటే 48 గంటల ముందు రవిప్రకాశ్‌కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్‌ ఈ రోజు సిసిఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/