మాదాపూర్‌లో ఎన్‌ఐఏ నూతన కార్యాలయం

rajnath singh, central home minister
rajnath singh, central home minister


హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో ఎన్‌ఐఏ ప్రాంతీయ నూతన కార్యాలయం ప్రారంభమైంది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో ఈ నూతన కార్యాలయం, నివాస సముదాయాలను నిర్మించారు. 2016న శంకుస్థాపన చేస్తే ఈ ప్రాజెక్టు నేడు ప్రారంభోత్సవం జరిగింది. తెలంగాణ, ఏపి, కర్ణాటక రాష్ట్రాలు ఈ ఎన్‌ఐఏ ప్రాంతీయ కార్యాలయ పరిధిలోకి వస్తాయి. ఆ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎన్‌ఐఏ డిజి మోది, ఐజి అలోక్‌ మిట్టల్‌ పాల్గొన్నారు.