ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధాని మోదీ, ఏం చేశారు

Asaduddin Owaisi,modi
Asaduddin Owaisi,modi

హైదరాబాద్‌ : నేడు హైదరాబాద్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో అసదుదీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీరిద్దరూ బీఫ్ తిని పడుకున్నారా? అని నిలదీశారు.ఖభారత వాయు సేన(ఐఏఎఫ్) పాక్ లోని బాల్‌కోట్‌ లో ఉన్న ఉగ్రస్థావరాలపై బాంబులు వేసింది. ఈ దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అంటున్నారు. మరోవైపు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాత్రం ఉగ్రవాదులకు సంబంధించిన 300 ఫోన్లను ట్యాప్‌ చేసిందంటారు. బాలకోట్‌లో 300 ఫోన్లు కనిపించిన మీకు.. ఓ ఉగ్రవాది 50 కేజీల ఆర్డీఎక్స్‌ను పుల్వామాకు తరలించడం మాత్రం కనిపించలేదు.లౌకికవాదం, సోదర భావాన్ని అంతం చేయాలనుకునే వారిపైనే తన పోరాటమని స్పష్టం చేశారు. ఖఎవరినైనా జాతీయ పార్టీలు ఎన్నని అడిగితే రెండు లేదా మూడు అని చెబుతారు. కానీ నేను మాత్రం ఒక్కటే జాతీయపార్టీ ఉందని అది బీజేపీ అంటాను. ఎందుకంటే కాంగ్రెస్‌ కూడా 1.5 బీజేపీనే. ఈ రెండు పార్టీలకు ఎలాంటి వ్యత్యాసం లేదు. రెండూ ఒకటేగ అని తెలిపారు. పుల్వామా ఉ‍గ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

https://www.vaartha.com/telengana/
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కొసం క్లిక్‌ చేయండి.