టిఆర్‌ఎస్‌ గూటికి పాలేరు ఎమ్మెల్యె!

upenderreddy, ktr
upenderreddy, ktr

హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి మరో ఎమ్మెల్యె కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందిన కందాళ ఉపేందర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ గూటికి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈరోజు ఆయన టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అంశాలపై చర్చించారు. గత కొంతకాలంగా ఉపేందర్‌ టిఆర్‌ఎస్‌ నేతలు టచ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సీటు ఇస్తామన్న హమీ ఉపేందర్‌ రెడ్డికి లభించినట్టు సమాచారం.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/