లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్

ts cm kcr
ts cm kcr


హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్‌ఎస్ యోధులు ఖరారయ్యారు. రాష్ట్రంలోని 17 స్థానాలకు పోటీచేసే పార్టీ అభ్యర్థుల జాబితాను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించారు. పార్టీ విధేయత, విజయావకాశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారుచేసినట్టు సమాచారం. అదే సమయంలో సామాజిక సమతూకం పాటించారు. ఎస్టీ, ఎస్సీల్లో ఉపకులాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్టీల్లో ఆదివాసీ, లంబాడాలకు, ఎస్సీల్లో మాదిగ, నేతకానివారికి సీట్లను కేటాయించారు. ఓసీల్లో కమ్మ, వెలమ, రెడ్లకు సీట్లు కేటాయించారు. ఎస్టీ రిజర్వుడు స్థానాలు రెండు ఉండగా వాటిలో ఒకటి ఆదివాసీలకు, మరొకటి లంబాడాలకు ఇచ్చారు. మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలకుగాను రెండింటిలో మాదిగలకు, ఒక స్థానంలో నేతకానివారికి అవకాశం కల్పించారు. బీసీ వర్గాలవారికి భువనగిరి, జహీరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలు కేటాయించారు. మిగిలిన ఎనిమిది సీట్లలో ఐదుగురు రెడ్లు, ఒక కమ్మ, ఇద్దరు వెలమలకు అవకాశం దక్కింది. మొత్తంగా ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ఖమ్మం), సీతారాంనాయక్ (మహబూబాబాద్), ఏపీ జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), గుత్తా సుఖేందర్‌రెడ్డి (నల్లగొండ)కి సీట్లు కేటాయించలేదు. అయితే.. గుత్తాను ఎమ్మెల్సీ బరిలో నిలుపాలని నిర్ణయించారు.

టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా

ఆదిలాబాద్ : గోడం నగేశ్
పెద్దపల్లి : బొర్లకుంట వెంకటేశ్ నేతకాని
కరీంనగర్ : బోయినపల్లి వినోద్‌కుమార్
నిజామాబాద్ : కల్వకుంట్ల కవిత
జహీరాబాద్ : బీబీ పాటిల్
మెదక్ : కొత్త ప్రభాకర్‌రెడ్డి
మల్కాజ్‌గిరి : మర్రి రాజశేఖర్‌రెడ్డి
చేవెళ్ల : డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి
సికింద్రాబాద్ : తలసాని సాయికిరణ్‌యాదవ్
మహబూబ్‌నగర్ : మన్నె శ్రీనివాస్‌రెడ్డి
నాగర్‌కర్నూలు : పోతుగంటి రాములు
నల్లగొండ : వేమిరెడ్డి నర్సింహారెడ్డి
భువనగిరి : డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
వరంగల్ : పసునూరి దయాకర్
మహబూబాబాద్ : మాలోతు కవిత
ఖమ్మం : నామా నాగేశ్వర్‌రావు
హైదరాబాద్ : పుస్తె శ్రీకాంత్