యువకుడిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

NIA
NIA


హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలస్‌స్టేషన్‌ పరిధిలోని శాస్త్రి పురంలో ఓ యువకుడిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్‌ సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారన్న సమాచారం మేరకు ఎన్‌ఐఏ అధికారులు యువకుడి ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకుని మాదాపైర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు.
8 నెలల క్రితం పట్టుబడిన అబ్దుల్‌ బాసిత్‌, అబ్దుల్‌ ఖాదర్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఎన్‌ఐఏ అధికారులు శనివారం పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. శాస్త్రిపురంలో తాహా మసూద్‌ అనే యువకుడు కొంతకాలంగా భార్యతో కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. కర్ణాటకకు చెందిన ఇతను ఐసిస్‌ సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్నట్లుగా ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. పాతబస్తీలో మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహించినఅధికారులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/