ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్‌ఎస్‌ అభ్యర్ది ఖరారు

TRS
TRS

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి ఖరారయ్యారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సియం కేసిఆర్‌ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు కుర్మయ్యగారి నవీన్‌రావు పేరును సియం కేసిఆర్‌ ఖరారు చేశారు. ప్రస్తుతం ఒకే ఖాళీ ఏర్పడడంతో నవీన్‌రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తామని సియం తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/