నామినేషన్‌ దాఖలు చేసిన కవిత

MP Kavitha files nomination
MP Kavitha files nomination

నిజామాబాద్‌: కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ ఎంపి స్థానానికి టిఆర్‌ఎస్‌ పార్టీ తరుపున నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యెలు పాల్గొన్నారు. మరోసారి పార్లమెంట్‌కు వెళ్లడానికి అవకాశం ఇస్తే సేవ చేసేందుకు ముందుంటానని ఆమె పేర్కొన్నారు. దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమయంలో రాష్ట్రంలో 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే.. తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం ఈ ఐదేండ్ల కాలంలో టీఆర్‌ఎస్ ఎంపీలందరూ ముందుండి కొట్లాడిండ్రు అని కవిత పేర్కొన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/