ఈ 17న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాలు ప్రారంభం

MLA, MLC quarters
MLA, MLC quarters


హైదరాబాద్‌: నగరంలోని హైదర్‌గూడలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహ సముదాయాలను ఈ నెల 17వ తేదీన ప్రారింభించనున్నారు. ఆ రోజున ఏరువాక పౌర్ణమి కావడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ ప్రారంభించాలని సియం కేసిఆర్‌ నిర్ణయించారు. ఈ నివాస గృహాలను స్పీకర్‌ పరిగె శ్రీనివాసరెడ్డితో కలిసి సియం కేసిఆర్‌ ప్రారంభించనున్నారు.
మొత్తం 4.5 ఎకరాల్లో రూ. 166 కోట్లతో 12 అంతస్తులతో 120 క్వార్టర్లను నిర్మించారు. 2100 చదరపు అడుగుల ప్రతి క్వార్టర్‌లో 3 బెడ్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోనే బ్యాంకు, క్లబ్‌ హౌజ్‌, సూపర్‌ మార్కెట్‌ నిర్మించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/