సిఎల్పీని టిఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని వినతి

స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

TS assembly
TS assembly

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ఎల్పీలో సిఎల్పీని విలీనం చేయాలని స్పీకర్‌ పరిగె శ్రీనివాసరెడ్డికి కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలు వినతిపత్రాన్ని సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో సబితా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, ఆత్రం సక్కు, బీరం హర్షవర్థన్‌రెడ్డి ఉన్నారు. సియం కెసిఆర్‌ నాయకత్వంలో పనిచేయడానికి 12 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నామని, గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని కూడా ప్రజలు సంపూర్ణంగా ఆమోదించారని ఆయన తెలిపారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున కేవలం 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/