గట్టు భీముని పార్ధివదేహానికి కేటిఆర్‌ నివాళి

KTR
KTR

జోగులాంబ గద్వాల: గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి పార్థివదేహానికి టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాళులర్పించారు. ఇవాళ ఉదయం గట్టు మండలం బలిగెరకు కేటీఆర్‌ చేరుకుని అనంతరం భీముడి పార్థివదేహానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు కేటిఆర్‌. ఈ సందర్భంగా భీముడి కుటుంబసభ్యులకు కేటిఆర్‌ సంతాపం తెలిపారు. ఇంకా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గట్టు భీముడు నిమ్స్‌లో చికిత్స పొందుతూ నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos