కృష్ణా నీరు ఏపికి 17.5, తెలంగాణకు 29 టిఎంసీలు

krishna water disputes tribunal
krishna water disputes tribunal


హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలసౌధలో త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ఇరు రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల విడుదలకు సంబంధించి చర్చించేందుకు గురువారం కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశమైంది. తెలంగాణకు 29, ఏపికి 17.5 టిఎంసీల నీరు విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే ఏపి తమకు మే నెలాఖరు నాటికి 17 టిఎంసీలు కావాలని కోరింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నదీ జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. ఈ మేరకు బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌ ఆర్కే జైన్‌ నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయనున్నారు.