పార్టీ మారుతున్నాననే వార్తలు అవాస్తవం

komatireddy venkatareddy
komatireddy venkatareddy

నల్గొండ: బిజెపిలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్టిపారేశారు. రాంమాధవ్‌తో చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆయన ఎవరో కూడా తనకు తెలియదని వివిరణ ఇచ్చారు. తనపై కుట్రతో ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఐనా తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని , బిజెపిలో చేరాల్సిన అవసరం అంతకంటే లేదని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటానని వెల్లడించారు. చనిపోతే కాంగ్రెస్‌ జెండా కప్పాలని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/