రైతుల ధాన్యం కొనుగోలు సొమ్మును వెంటనే చెల్లించాలి

komatireddy venkat reddy
komatireddy venkat reddy

హైదరాబాద్‌: రైతులకు ధాన్యం కొనుగోలు బిల్లులను వెంటనే చెల్లించాలని ఎంపి కోమటిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రబీ పంట ధాన్యం నగదును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అన్నం పెట్టే రైతన్నలను ఇబ్బందులు పెట్టకూడదని, డబ్బులు వెంటనే చెల్లిస్తారనే నమ్మకంతోనే వారు ధాన్యం విక్రయించారని తెలిపారు. ప్రభుత్వం మూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పి మూడు నెలలైనా చెల్లించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. రైతులకు చెల్లించాల్సిన డబ్బులు నాలుగు రోజుల్లోగా చెల్లించాలని కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/