బోడుప్పల్‌లో కిడ్నాప్‌ కలకలం

Boduppal Area
Boduppal Area

హైదరాబాద్: బోడుప్పల్‌లో ఓ వ్యక్తి కిడ్నా్‌ప కు గురైనట్లు కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట్‌ జిల్లా మద్దూర్‌ మండలానికి చెందిన రామకృష్ణారెడ్డి స్టీల్‌ వ్యాపారం చేసేవాడు. వ్యాపార రీత్యా అదే మండలంలోని పలువురి వద్ద నుంచి లక్షల రూపాయలు అప్పు చేసి తిరిగి చెల్లించకుండా పారిపోయి వచ్చి బోడుప్పల్‌లోని భీంరెడ్డినగర్‌ కాలనీలో ఉంటున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తులు అడ్రస్‌ కనుక్కొని ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి డబ్బులు అడిగారు. ఇంటి వద్ద వద్దని బయట మాట్లాడుకుందామని వెళ్లారు. అనంతరం కృష్ణారెడ్డి భార్య తన భర్తను కిడ్నాప్‌ చేశారని పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు విచారించగా రామకృష్ణారెడ్డి పలువురికి డబ్బులు ఇవ్వాల్సిందిగా తేలినట్లు, . దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.