కెసిఆర్‌,కెటిఆర్‌ పై పోగడ్తల జల్లు

యాదాద్రి భువనగిరి : నేడు భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొత్త పుంతలు తొక్కించారని ఆయన అన్నారు.ఒకవైపు ఉద్యమం..మరోవైపు అభివృద్ధిని విజయవంతంగా నడిపిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో పోటీ చేసినా కేసీఆర్ అద్బుతమైన మెజార్టీతో గెలుస్తరని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తంగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి నమూనాల వైపు దేశం చూస్తోందన్నారు. 100కు పైగా దేశాల్లో తెలంగాణ పదం ఉచ్ఛరిస్తున్నారంటే దానికి కారణం కేటీఆర్ అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.