ఫడ్నవీస్‌ను ఆహ్వానించిన సియం కేసిఆర్‌

KCR, devendra fadnavis
KCR, devendra fadnavis

ముంబై: మహారాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ సియం కేసిఆర్‌ ఆ రాష్ట్ర సియం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఈ సందర్బంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా ఫడ్నవీస్‌ను సియం కేసిఆర్‌ ఆహ్వానించారు. అంతకు ముందు సియం కేసిఆర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సిహెచ్‌ విద్యాసాగర్‌ను కలిసి ఆయనను ఆహ్వానించారు. సియం వెంట వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపి సంతోష్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/