జోయలుక్కాస్‌ కొత్త షోరూంను ఆరంభించిన కాజోల్‌

kajol devgan
kajol devgan

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జోయలుక్కాస్‌ ఆభరణాల షోరూంను ఆమె బుధవారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ షోరూం కాప్రా సర్కిల్‌ ఏ ఎస్‌ రావునగర్‌లో ఉంది. కాజోల్‌ను చూడటానికి ఆమె అభిమానులు ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో చేరుకుని కాజోల్‌ను చూసి ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.
ఈ సందర్భంగా కాజోల్‌ మాట్లాడుతూ..జోయలుక్కాస్‌ షోరూంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అభిమానులను, ఆభరణాల ప్రేమికుల్ని కలుసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. 2020 నాటికి 200 షోరూంలే లక్ష్యంగా పనిచేస్తున్నామని జోయలుక్కాస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండి జో§్‌ు అలుక్కాస్‌ తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/