రేపు విధుల్లోకి జూనియర్‌ పంచాయితీ కార్యదర్శులు

TSPSC
TSPSC


హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ పంచాయితీ కార్యదర్శులు రేపటి నుంచి విధుల్లోకి రానున్నారు. ఈ పోస్టుల భర్తీకి వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ..శుక్రవారం అర్ధరాత్రిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ గురువారం సాయంత్రం ముగియగానే జూనియర్‌ పంచాయితీ కార్యదర్శులుగా ఎంపికైన వారికి నియామకపు పత్రాలు అందించాలని పంచాయితీ రాజ్‌ శాఖ బుధవారం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ధేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నియామకపు ఉత్తర్వులు జారీఅయ్యేలా పంచాయితీరాజ్‌ శాఖ కమీషనర్‌ చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/