23,24 తేదీలలో ఉచితంగా పారిశ్రామిక ఉత్పత్తుల భారీ ప్రదర్శన

సైఫాబాద : విదేశీ మారక ద్రవ్యాన్ని నిరోధించడానికి ఈ నెల 23,24 తేదీలలో నగరంలోని హెటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఉచితంగా ‘వాహనాలు పారిశ్రామిక ఉత్పత్తుల భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని నిర్వహకులు డా.కె.ఎస్‌.మూర్తి తెలిపారు. ఆదివారం ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ భారీ ప్రదర్శన జరుగుతుందని, 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు వాహనాలపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ ప్రదర్శనలో అధునాతమైన కార్లు, త్రిచక్ర, ద్వీచక్ర వాహనాలతోపాటు ఎలక్ట్రికల్‌ వాహనాలు ఉంటాయని, ఈకార్యక్రమంలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్ధ ఎండి ఇ.వి.నరసింహారెడ్డి, జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి ఎం.డి.ఖాన్‌, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరలు పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో టున్వాల్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సంస్ధ ప్రతినిధి మహిపాల్‌గౌడ్‌, వాసవి వీల్స్‌ సంస్ధ అధినేత వెంకటేశ్వరగుప్తా తదితరలు పాల్గొన్నారు.

https://www.vaartha.com/telengana/మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: