భద్రాద్రిపై ప్రతిపాదన ఏమీ జరగలేదు

indrakaran reddy
indrakaran reddy, endowment minister

తిరుమల: ఈ రోజు తిరుమల శ్రీవారిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సియంలు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఐదేళ్ల గడువున్నా హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఏపి భవనాలను తెలంగాణకు అప్పగించడం అభినందనీయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సియం జగన్‌ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలాన్ని త్వరలోనే ఏపిలో విలీనం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. ఇటీవల రాజ్‌ భవన్‌లో గవర్నర్‌తో భేటి సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అలాంటి ప్రతిపాదనలు ఏమీ జరగలేదని తాజాగా ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/