బీజేపీకి నా వంతుగా కృషి చేస్తా!

D K Aruna
D K Aruna

ఢిల్లీ : డీకే అరుణ చేరికతో తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటుందని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శించారు. తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలతో బీజేపీ పుంజుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. ఇతర పార్టీల బలహీనతలను వాడుకోమని తామెప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం జీవించే ప్రతీ యకుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఇక, తెలంగాణలో బీజేపీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని డీకే ప్రకటించారు.