నగరంలో పలుచోట్ల వర్షం

heavy rain
heavy rain

హైదరాబాద్‌: భాగ్యనగర వాసులకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా..మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, కవాడిగూడ, అశోక్‌నగర్‌లతో పాటు శివారు ప్రాంతాలైన అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వడగళ్లు కూడా పడ్డాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/