తెలంగాణలో భారీ వర్ష సూచన!

rain fall
rain fall


హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశారు. నైరుతి బుతుపవనాల ప్రభావంతో నిన్న తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, బేగంబజార్‌, హిమయత్‌నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, అమీర్‌పేట, మధురానగర్‌, యూసఫ్‌గూడ, జీడిమెట్ల, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం పడింది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos