నరసింహన్ కు ఘనంగా వీడ్కోలు పలికిన కెసిఆర్‌

Governor Narasimhan
Governor Narasimhan

హైదరాబాద్‌: ఉమ్మడి ఏపి గవర్నర్ గా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా 9 ఏళ్ల 9 నెలల పాటు కొనసాగిన నరసింహన్ ప్రస్థానం ముగిసింది. నేటితో ఆయన పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి భవన్ లో ఆయనను ఘనంగా సన్మానించింది. కాసేపటి క్రితం హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తన సొంత నగరమైన చెన్నైకు ఆయన బయల్దేరారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం సిఎం కెసిఆర్‌,మంత్రులు నరసింహన్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. దీంతో, గవర్నర్ గా నరసింహన్ శకం ముగిసింది. తెలంగాణ గవర్నర్ గా రేపు తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/