ఆసుపత్రిలో నలుగురు సిబ్బంది సస్పెండ్‌

Government Area Hospital at Bhadrachalam
Government Area Hospital at Bhadrachalam

కొత్తగూడెం: భద్రచలం ప్రభుత్వం ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు వైద్యులు, ఒక సహయకుడిని సస్పెండ్‌ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కమిషనర్‌ అశోక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీరు ప్రైవేటు ప్రాక్టిస్ చేస్తున్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో వైద్యులపై చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవరాజ్, రామకృష్ణలపై చర్యలు తీసుకున్నారు. అత్యవసర విభాగం ఇన్‌ఛార్జిగా ఉన్న రమేశ్ చంద్రపై లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. నూతన సూపరింటెండెంట్‌గా కోటిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రేపటి నుంచి నూతన సిబ్బంది విధులకు హాజరుకానున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/