ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు భారీ బందోబస్తు

Police Commissioner Mahesh Bhagwat
Police Commissioner Mahesh Bhagwat

హైదరాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నగరంలోఇ ఉప్పల్‌ స్టేడియంలో జరుగనుంది. దీనికోసం పూర్తి బందోబస్తు కల్పించినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. అయితే మ్యాచ్‌ ఆదివారం రాత్రి 7గంటల 30నిమిషాలకు ముంబై, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టేడియం లోపల పరిసరాలతో 300సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ చెప్పారు. స్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్‌ సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తంగా 2800పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారని సీపీ తెలిపారు. స్టేడియం, పిచ్‌ను ఇప్పటికే తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. నిషేధిత వస్తువులు తీసుకురావద్దని క్రికెట్ అభిమానులకు సూచించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/